KOWMUDIS Acuupoint treatment centre

Acupuncture clinics in Hyderabad,

viglinks

Thursday 15 November 2018

acupuncture is safe

Acupuncture is safe  


ఆక్యుపంక్చర్‌ వైద్యం సుర‌క్షిత‌మేనా?

ఆక్యుపంక్చర్‌ వైద్యం సురక్షితమైంది. ఇది చౌకగా లభించే వైద్యం. 5 వేల సంవత్సరాల నుంచి చైనాలో అనుసరించిన అతి పురాతన వైద్య విధానం. ఏదైనా సమస్య బాధిస్తే శరీరంలో మరికొన్నిచోట్ల సూదులతో గుచ్చి పాయింట్లను ఉద్రేక్తపరచడం ద్వారా వ్యాధుల నివారణలో అనేక ప్రయోజనాలు కలుగుతాయని నిర్ధారణకు వచ్చారు. ఇందుకోసం వెదురు, రాతి, ఎముకలతో చేసిన సూదులు, చేప ముల్లును ఉపయోగించారు. ప్రస్తుతం బంగారం, వెండి, రాగితోపాటు తుప్పు పట్టకుండా స్టీలు సూదులు ఉపయోగిస్తున్నారు. ఆక్యుపంక్చర్‌ పాయింట్లు 20గా ఉన్నట్లు చైనీయులు గుర్తించారు, ఇందులో శరీరంలో ముందు భాగంలో ఆరు, వెనుక ఆరు ఉంటాయి. శరీరం ప్రతి కదలిక జీవశక్తి అదుపులోనే ఉంటుంది. ఇవి జీవశక్తి ద్వారా ప్రవహించి వ్యాధి నిరోధక శక్తిని పెంచి వ్యాధులు రాకుండా చేస్తాయి. శరీరంలోని ప్రతి కణానికీ అవసరమైన శక్తి అందిస్తుందన్నారు. క్యూ1 మూడు విధాలుగా శరీరంలోకి ప్రవహిస్తుంది. పుట్టుకతో తల్లిదండ్రులు నుంచి, ఆహారం ద్వారా, ప్రాణ వాయువు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. మానవ శరీరంలో 2 వేలు ఆక్యుపంక్చర్‌ పాయింట్లను గుర్తించారు. ప్రతి పాయింట్‌ కూడా వ్యాధులను నయం చేయడంలో ఉపయోగపడుతుంది.

Acupuncture is safe


మణికట్టు వద్ద ఒక్కొక్క చేతికి ఆరు చొప్పున 12 పల్స్‌ను చేతి స్పర్శతో గుర్తించవచ్చు. ఆక్యుపంక్చర్‌ వైద్య విధానంతో వ్యాధులను నిర్ధారించడంలో పల్స్‌ డయోగసిస్‌ ముఖ్యం. వ్యాధుల నిర్ధారణలోనూ, నివారణలోనూ యిన్‌, యంగ్‌తోపాటు నీరు, కలప, అగ్ని, లోహం, భూమి, పల్స్‌ డయోగ్నాసిస్‌ ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ వైద్య విధానం శారీరక, మానసిక, ఊపిరితిత్తులు, ఎముకలు, నరాల సంబంధ వ్యాధులు, వివిధ రకాల నొప్పుల నివారణలో ఉపయోగపడుతుంది. ఇది ఎటువంటి దుష్ప్రభావమూ చూపని వైద్యంగా గుర్తించబడుతోంది.

అంతేకాదు, ఆక్యుపంక్చర్ తో గుండె పోటును కూడా అరికట్టవచ్చంటూ 2011లో రిసెర్చ్‌లో తేలింది. ఇది నరాల వ్యవస్ధపై పని చేసి అధికంగా గుండెకొట్టుకోడాన్ని, సరిగా లేని రక్తపోటును నియంత్రించటానికి తోడ్పడుతుంది. గుండె పోటుకు కారణం నరాల వ్యవస్ధ అతిగా స్పందించడమే. కనుక ఈ నరాల కదలికలను ఆక్యుపంక్చర్ తో నియంత్రిస్తే హార్టు ఫెయిల్యూర్ వుండదని రిసెర్చ్ నిపుణులు చెప్పారు. గుండె విఫలతలకు వైద్యంగా ఆక్యుపంక్చర్ ను మొదటిసారిగా యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ లోని అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ డా. హోలీ ఆర్ మిడిల్ కఫ్ ఉపయోగించారు. 14 మంది గుండె రోగులపై దీనిని ప్రయోగించారు. ఆక్యుపంక్చర్ వైద్యం గుండె జబ్బులు కలవారిలో కొంతమందికి చేశారు. చేసిన వారికి నరాల వ్యవస్ధ, రక్తపోటు నియంత్రణ సమర్ధవంతంగా వుండగా, వైద్యం చేయని ఇతర గుండె రోగులకు వ్యతిరేక ఫలితాలు చూపాయి. అయితే, ఈ వైద్యాన్ని మరింత మంది రోగులకు ఇచ్చి ఫలితాలు విస్తృత పరిధిలో పరిశీలించాల్సివుందని ఆయన తెలిపారు. అయితే, క్లినికల్ పరీక్షలలో దీర్ఘకాల ఫలితాలలో ఆక్యుపంక్చర్ వైద్యం ద్వారా హైపర్ టెన్షన్ బాగా తగ్గినట్లు దీని కారణంగా నరాల వ్యవస్ధ ఎంతో ప్రశాంతత పొందినట్లుగా కూడా డాక్ట‌ర్ హోలీ తెలిపారు. 

ఇలా ప్ర‌పంచ‌వ్యాప్తంగా వివిధ దేశాల్లో జ‌రుగుతున్న రిసెర్చ్‌ల్లో ఆక్యుపంక్చ‌ర్ సుర‌క్షిత‌మైన వైద్య‌విధానమ‌ని తేలింది. 
for appointments please call
Dr.Nath
8019520812
www.kowmudis.com

No comments:

Post a Comment