చైనీయులు శరీరంలో జీవశక్తి ప్రవహించే మార్గాలను మెరిడియన్ అని పిలిచారు. ఇవి నిలువుగానూ, అడ్డంగానూ పయనిస్తుంటాయి. ఇవి శరీరంపై భాగంలో కలిసే చోట్లు 365 ఉంటాయి. ఆక్యుపంక్చర్ వైద్యంలో రోగ నిర్ణయానికి నాడి చూడడం ఒక పద్ధతిగా వస్తున్నది. మెరిడియన్ గుర్తించిన చోట్లు రెండు వేల వరకూ పెరిగాయి. శరీరంలో రెండురకాల శక్తులు ఉన్నాయి.వాటిలో స్త్రీ శక్తిని "ఇన్" అంటారు. పురుష శక్తిని "యంగ్" అంటారు.
శరీరంలో ఈ శక్తులు తులనాత్మకంగా ఉండటానికి అనువుగా సూదులు గుచ్చి ప్రకోపింప చేసి సరైన పద్ధతిలో పెట్టవచ్చు.. ఋతువులూ, వాతావరణం రోజులో సమయం, నాడి ఆధారంగా రోగ లక్షణాలను నిర్దారిస్తారు. దేహంలోని అంగాలకు ప్రాతినిధ్యం వహిస్తూ మణికట్టు వద్ద నాడి ఆరు విధాలుగా ఆడుతుంది. ప్రతినాడీ ప్రకంపనానికి 25 లక్షణాలున్నాయి. చికిత్స ప్రారంభించేముందు రోగి నాడిని ఆధారంగా 300 నాడీ ప్రకంపనాలను పరిశీలిస్తారు. సూదులను ఆయా శరీర భాగాలలో గుచ్చి ఎంతసేపు ఉంచవలసిందీ రోగి లక్షణాలను బట్టి నిర్ణయిస్తారు. ఈ సూదులు 6 అంగుళాల నుండి 12 అంగుళాల వరకూ ఉంటాయి. ఒక మూలికను ఆయా శరీర భాగాల మీదగానీ, పుండు పడిన చోట గానీ ఉంచి వేడి చేస్తారు. ఏ రోగానికైనా ఈ సూది మందులు పనిచేస్తాయని నమ్మారు.
రోగనిర్ధారణలో నాలుకను కూడా పరిశీలిస్తారు. ప్రాచీన చైనాలో శరీరాన్ని కోసి చూడటం నిషిద్ధం. ఆక్యుపంక్చర్ విరోచనాలకు, కంటిజబ్బులకు, ముక్కు దిబ్బడలకు, గొంతునొప్పికి, ఉబ్బసానికీ, కీళ్ళవాతానికీ, శరీరంలో పుండ్లకు పనిచేస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులకు, తలనొప్పి, మలబద్ధకం, లైంగిక వ్యాధులూ, అలసట వంటి లక్షణాలకు ఆక్యుపంక్చర్ పనిచేస్తుందని జోసఫ్ హెల్మ్ ప్రకటించారు. ప్రస్తుతం ఆక్యుపంక్చర్ అమెరికా, ఇండియా తదితర దేశాలలో ప్రచారంలో ఉంది.
ఆక్యుపంక్చర్ అనగానే ముందుగా నొప్పి తగ్గించే గుణం గుర్తుకొస్తుంది అందరికి. ఎలాంటి నొప్పినైనా సరే తలనొప్పి, మైగ్రేన్ నుంచి మెడనొప్పి, భుజంనొప్పి, తుంటినొప్పి, మోకాలునొప్పి, కీళ్లనొప్పులు, భుజంనొప్పి, నడుమునొప్పి, మడిమనొప్పి మాత్రమే కాదు క్యాన్సర్‌వల్ల వచ్చే నొప్పి కూడా తగ్గించే గుణం ఆక్యుపంక్చర్‌కు ఉంది. దీనికి కారణం శరీరంలోని ఆక్యుపంక్చర్ పాయింట్స్‌కు నొప్పిని నివారించే గుణం ఉంది. ఈ అనల్జిక్ యాక్షన్‌ను ఉపయోగించుకొని చైనీయులు ఆక్యుపంక్చర్ అనస్థీషియాను అభివృద్ధి పరిచారు. కొన్ని పాయింట్స్‌ని ఉత్తేజ పరిచి, ఎటువంటి మత్తు అవసరం లేకుండానే ఎటువంటి దుష్ఫ్రభావాలు లేకుండా పెద్దపెద్ద సర్జరీలు చేయగలుగుతున్నారు.
రోగనిరోధక శక్తిని పెంపొందించే గుణం ద్వారా ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనే శక్తిని పెంపొందించవచ్చు. హోమియో స్టెసిన్ మెకానిజం ద్వారా బీపీ, నాడీ వేగం, ఇన్సులిన్ ఉత్పత్తి, ఎంజైముల సమసతుల్యం మీద ప్రభావం చూపి వీటన్నింటిని సమన్వయ పరుస్తుంది. మధుమేహం, థైరాయిడ్, బీపీ వంటి సమస్యపూన్నింటినో అదుపులో పెట్టవచ్చు. రాకుండా నివారించవచ్చు. బెస్ట్ టోనిఫికేషన్ పాయింట్ ద్వారా శరీరంలోని అన్ని జీవక్షికియలను టోనిఫై చేయవచ్చు. అంటే ఎటువంటి మందులు, టానిక్కులు లేకుండానే మన శరీరంలోని శక్తిని చలన పరచుకొని ఎన్నొ రోగాలను తరిమికొట్ట వచ్చు.
for appointments please call
Dr.Nath
8019520812
www.kowmudis.com
Dr.Nath
8019520812
www.kowmudis.com
No comments:
Post a Comment